![]() |
![]() |

సరిగమప లిటిల్ చాంప్స్ లో వరుణవి స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. ఇక ఈ వారం ఆమె వేసుకొచ్చిన డ్రెస్ చూసి సుధీర్ హ్యాపీగా ఫీలవుతూ "నేను ఇచ్చిన డ్రెస్ వేసుకున్నావ్ ఈ డ్రెస్ లో చాల అందంగా ఉన్నావ్. మా అమ్మ చాల హ్యాపీగా ఫీలవుతుంది" అని అన్నాడు. "ఐతే నేను ఈ డ్రెస్ లో బుట్టబొమ్మలా ఉన్నానని చెప్పు. మీ అమ్మగారు ఈ డ్రెస్ మాత్రమే కాదు ఇంతమంచి యాంకర్ ని ఇంతమందికి గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పు" అంది వరుణవి.
ఇంతలా పొగుడుతావని అనుకోలేదు అని సుధీర్ అనేసరికి ఇచ్చే గిఫ్టులను బట్టే నేను చెప్పే మాటలుంటాయి. నీ కోసం ఒక కవిత రాసాను..అనగనగా ఒక సుధీర్, నీకుంది చానా డేర్, పిల్లలంటే చానా కేర్, అతను వచ్చేశాడంటే పోతుంది బోర్, ఎంటర్టైన్మెంట్ లో మా సుధీర్ మావ ఒక షేర్ " అంటూ చెప్పింది.
"చాలు ఈ జీవితానికి ఇది చాలు" అన్నాడు సుధీర్. "నాకు చాలదు ఇంకో రెండు డ్రెస్సులు కుట్టించు" అంది. "సరే కుట్టిస్తాను డ్రెస్సులు..కవిత నా కోసమే రాసావా జడ్జెస్ కోసం రాయలేదా" అని అడిగాడు. "నాకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సిన వాళ్ళ గురించి చెప్పకపోతే ఎలా..కాకినాడలో కాజా ఫేమస్, సరిగమపలో శైలజమ్మ ఫేమస్..పట్టాల మీద నడిచేది రైలు..ఈ షోని నడిపించేది మా శైలు..శైలజ అమ్మమ్మను ముద్దుగా శైలు" అని పిలుస్తానని చెప్పింది.
"ప్రశాంతంగా ఉండాలంటే వెళ్ళాలి గుడి.. మనం ప్రశాంతంగా నవ్వాలంటే ఉండాలి అనిల్ రావిపూడి...మావ అని నేను ఎందుకు అంటానంటే మా దేవుడు నువ్వేనయ్యో మా కోసం పుట్టావయ్యో" అని చెప్పింది.
ఇక అనంత శ్రీరామ్ పెద్ద రైటర్ కదా నేనేం రాయలేదు అని చెప్పేసింది. 'అదేంటమ్మా ఎదో ఒకటి రాయి" అంటూ అనంత్ అడిగేసరికి "మీ అంత గొప్పగా రాయలేను మీరే ఏదో ఒకటి రాసుకోండి" అనేసింది వరుణవి.
![]() |
![]() |